తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ మద్యం కేసు - ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు

ED Notices to MLC Kavitha in Delhi Liquor Scam Case : ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి షాక్​ ఇచ్చింది. దిల్లీ మద్యం కేసులో మరోసారి నోటీసులు జారీ చేసింది. మంగళవారం విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. అయితే దీనిపై స్పందించిన కవిత విచారణకు హాజరుకాలేనని ఈడీకు లేఖ పంపింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్​లో ఉందని లేఖలో పేర్కొంది.

MLC Kavitha
ED Notices to MLC Kavitha in Delhi Liquor Scam Case

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 7:15 PM IST

Updated : Jan 15, 2024, 9:24 PM IST

ED Notices to MLC Kavitha in Delhi Liquor Scam Case :దిల్లీ మద్యం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. మంగళవారం విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గతంలోనూ కవితకు ఈ కేసులో నోటీసులు జారీ చేసింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించి విచారణకు హాజరుకాలేనని ఈడీకు లేఖ రాసింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్​లో ఉన్నందున హాజరుకాలేనని ఆ లేఖలో ఉంది.

దిల్లీ లిక్కర్​ స్కాంలో కీలకాంశాలు

  • 2022 ఆగస్టు 17న దీల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ సహా 8 రాష్ట్రాల్లో లిక్కర్​లో జరిగిన అవతవకలపై సీబీఐ కేసు నమోదు
  • 2022 సెప్టెంబర్​ 21న సీబీఐ ఎఫ్​ఐఆర్​ ఆధారంగా ఈడీ దర్యాప్తు
  • 2022 సెప్టెంబర్​ 27న ఈ కేసులో మొదటి వ్యక్తి ఆప్​ కమ్యూనికేషన్​ ఇంఛార్జి నాయర్ అరెస్ట్
  • 2022 నవంబర్​ 26న ఈడీ తొలి చార్జ్​షీట్​ నమోదు చేసింది. రూ.291 కోట్లు అక్రమ లావాదేవీలు జరిగాయని ప్రస్తావన
  • 2022 నవంబర్​ 30న అమిత్​ అరోరాపై ఈడీ జరిపిన విచారణలో వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్సీ కవిత పేరు
  • 2022 డిసెంబర్​ 2న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు
  • 2022 డిసెంబర్​ 11న కవితను విచారించిన సీబీఐ
  • 2023 మార్చి 8న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు
  • 2023 మార్చి 11న ఈడీ విచారణకు కవిత హాజరు
  • 2023 మార్చి 16న రెండోసారి ఈడీ విచారణకు కవిత
  • 2023 మార్చి 20 నుంచి వరుసగా మూడురోజుల పాటు ఈడీ విచారణకు హాజరు
  • 2024 జనవరి 15న మరోసారి ఈడీ విచారణకు హాజరుకావాలని నోటీసులు

గతంలో కవితకు రెండు సార్లు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం దిల్లీలో ఆమెను అధికారులు మూడు రోజులు విచారణ చేశారు. అయితే ఆమె ఈడీ చేసిన విచారణపై సుప్రీం కోర్టులో ఫిటిషన్​ వేసింది. ఈ కేసులో ఆప్​ నేత మనీష్ సిసోడియా అరెస్టై జైల్లో ఉన్నారు. లిక్కర్​ పాలసీ స్కామ్​ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​కు ఈడీ నాలుగు సార్లు నోటీసులిచ్చింది.

Congress Leader Reaction on MLC Kavitha ED Notices: దిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం ద్వారా కేంద్రంలోని బీజేపీ సరికొత్త డ్రామాకు తెరలేపిందని ఆరోపించారు. తెలంగాణాలో ఓటమిపాలైన తరవాత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ లబ్ది పొందేందుకే ఈడీ సమన్ల డ్రామాను తెరపైకి తెచ్చిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి లోకసభ ఎన్నికల్లో ఓట్లను దండుకోడానికే ఈ నాటకం ఆడుతున్నందని ద్వజమెత్తారు. లిక్కర్‌ కేసులో కవితపై బీజేపీ చర్యలు తీసుకోకపోవడంపై తెలంగాణ ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందని తెలిపారు. ఇప్పడు బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఎన్ని జిమిక్కులు చేసినా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని విమర్శించారు.

3 రోజుల్లో 29 గంటల పాటు సాగిన కవిత ఈడీ విచారణ.. తదుపరి తేదీపై రాని స్పష్టత

ఇంటికి వచ్చి విచారించండి.. ఆడియో, వీడియో ద్వారా అయినా ఓకే : ఎమ్మెల్సీ కవిత

ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. నేడు ఎనిమిదిన్నర గంటల పాటు..

Last Updated : Jan 15, 2024, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details