TSPSC Paper leak Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు జరిగాయనే ఆరోపణలతో ఇప్పటి వరకు నిందితులను విచారించిన ఈడీ అధికారులు.. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనిత రామచంద్రన్‌ను ప్రశ్నిస్తున్నారు. దాదాపు 8 గంటలుగా వీరి విచారణ కొనసాగుతోంది.
ఈ మేరకు ఇరువురి వాంగ్మూలాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నమోదు చేస్తున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలో ఇప్పటి వరకు రూ.38 లక్షల లావాదేవీలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించగా.. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటికే నిందితుల వాంగ్మూలాలను చంచల్‌గూడ జైలులో ఈడీ అధికారులు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.