తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. నేడు ఎనిమిదిన్నర గంటల పాటు..

MLC Kavitha ED Inquiry Today : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత వరుసగా రెండో రోజు ఈడీ విచారణ ముగిసింది. దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు అధికారులు కవితను ప్రశ్నించారు.

MLC Kavitha
MLC Kavitha

By

Published : Mar 21, 2023, 7:02 AM IST

Updated : Mar 21, 2023, 8:25 PM IST

MLC Kavitha ED Inquiry Today : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ ముగిసింది. వరుసగా రెండోరోజు కవితను విచారించిన ఈడీ అధికారులు.. దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. సోమవారం 10 గంటల పాటు విచారించిన ఈడీ.. ఇవాళ మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో ఎమ్మెల్సీ కవిత వరుసగా రెండో రోజు ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

ఉదయం ఈడీ కార్యాలయంలోకి కవిత తన పాత ఫోన్లను తీసుకుని వెళ్లారు. కవర్లలో తీసుకువెళ్తున్న ఫోన్లను మీడియాకు చూపించారు. కవిత కొన్ని నెలల్లోనే 10 ఫోన్లు మార్చారని ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది. మద్యం కేసు ఆధారాలున్న ఫోన్లను ధ్వంసం చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వెల్లడించింది. ఈ క్రమంలో ఇవాళ విచారణకు కవిత తన ఫోన్లను తీసుకెళ్లారు. ఆ 10 ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించారు. వారు దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు కవితను ప్రశ్నించారు.

10 గంటలపాటు విచారించిన ఈడీ : దిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేయించుకొని.... అనుచిత లబ్ధి పొందేందుకు సౌత్‌గ్రూప్‌ ద్వారా ఆప్‌ నేతలకు 100 కోట్ల ముడుపులు చెల్లించారని., ఇండో స్పిరిట్‌ సంస్థ 192 కోట్ల ప్రయోజనం పొందిందన్న ఆరోపణలపై.... మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో కవితకు బినామీగా వ్యవహరించారనే ఆరోపణతో అరుణ్‌ రామచంద్రపిళ్లైను అరెస్ట్‌ చేసి... 14 రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించింది. తర్వాత ఎమ్మెల్సీ కవితను ఈ నెల 11న తొలిసారి 8 గంటల పాటు, నిన్న 10 గంటలపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. నిన్న ఈ కేసులో రెండోసారి ఈడీ విచారణకు హాజరైన కవితను... పీఎంఎల్​ఏ సెక్షన్ 50 కింద ఈడీ అధికారులు విచారించారు.

మద్యం విధానంతో ఎలాంటి సంబంధం లేదు : సోమవారం విచారణలో ఆమెను... ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులతో కలిపి విచారించారా.? లేదా? అనేదానిపై స్పష్టత రాలేదు. అయితే పలు విషయాలపై ఆమె నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. తనకు... దిల్లీ మద్యం విధానంతో ఎలాంటి సంబంధం లేదని, ఇది రాజకీయ కుట్ర అని కవిత... ఈడీ అధికారులతో అన్నట్లు సమాచారం. తనను నిందితురాలిగా పిలిచారా ? అని కూడా.... కవిత అడిగినట్లు తెలిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు.... ఈడీ కార్యాలయానికి చేరుకున్నప్పటికీ, గంట వరకు అధికారులెవ్వరూ రాలేదని, అప్పటివరకూ గదిలో ఒంటరిగా కూర్చోబెట్టినట్లు సమాచారం. ఈడీ అధికారులు ప్రశ్నలన్నీ రాజకీయ కోణంలో సంధించినట్లు... బీఆర్​ఎస్​ వర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు ఈడీ తనకు జారీచేసిన సమన్లను కొట్టేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌, ఆ కేసులో తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు జారీ చేయొద్దని కోరుతూ... ఈడీ దాఖలు చేసిన కెవియట్‌లు ఈ నెల 24న విచారణకు రానున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Mar 21, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details