ED Files Charge Sheet in Agrigold Scam: అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర్ (ముగ్గురు) అనే వ్యక్తులపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వారితోపాటు అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఛార్జిషీట్ వేసింది. ఈడీ ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన హైదరాబాద్‌లోని నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు.. అక్టోబరు 3వ తేదీన కోర్టుకు హాజరుకావాలంటూ అగ్రిగోల్డ్ ప్రమోటర్లు, కంపెనీలకు కోర్టు సమన్లు జారీ చేసింది. అగ్రిగోల్డ్ కేసులో రూ.4,141 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
ED Filed Chargesheet in Nampally Metropolitan Sessions Court: అగ్రిగోల్డ్ కుంభకోణానికి సంబంధించి.. ఈడీ బుధవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ముగ్గురు ప్రమోటర్లతో పాటు 11 కంపెనీలను నిందితులుగా పేర్కొంది. ఈ క్రమంలో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు.. అక్టోబరు 3వ తేదీన హాజరు కావాలంటూ నిందితులకు సమన్లు జారీ చేసింది. ఆరు రాష్ట్రాలకు చెందిన 32 లక్షల మందిని సుమారు రూ.6వేల కోట్ల రూపాయలకు పైగా మోసం చేశారని నిందితులపై అభియోగాలు రావడంతో.. ఈ కేసులో ఈడీ ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేయడంతో పాటు.. 4వేల 141 కోట్ల రూపాయల ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది.
చనిపోయేదాకా మాకు న్యాయం జరగదా?: అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన
ED charge sheet on 11 Subsidiary Companies Including Agrigold Farm Estates: అగ్రిగోల్డ్ కేసు విషయంలో నేడు ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో.. ప్రమోటర్లు అవ్వా వెంకట రామారావు, ఏవీ శేషునారాయణ రావు అలియాస్ కుమార్, అవ్వా హేమసుందర వరప్రసాద్ అలియాస్ రాజాలను నిందితులుగా ఈడీ పేర్కొంది. అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,అగ్రిగోల్డ్ కన్‌స్ట్రక్షన్స్, డ్రీమ్ ల్యాండ్ వెంచర్స్, బుధపాలిత టింబర్ ఎస్టేట్స్, నాగవల్లి ప్లాంటర్స్, హరితమోహన ఆగ్రో ప్రాజెక్ట్స్, ఆర్కా లీజర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అగ్రిగోల్డ్ ఫుడ్స్ అండ్ ఫామ్ ప్రొడక్ట్స్, అగ్రిగోల్డ్ ప్రాజెక్ట్స్, బ్రూక్ ఫీల్డ్స్ అండ్ రిసార్ట్స్, అగ్రిగోల్డ్ ఆర్గానిక్స్ కంపెనీలను కూడా నిందితుల జాబితాలో చేర్చింది.