Sanjay Raut News: శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్‌కు సంబంధించిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. రూ.1,043 కోట్లు విలువైన పాత్రచాల్ భూకుంభకోణంలో ఆయనతో పాటు కుటుంసభ్యులకు చెందిన అలిబాగ్‌లోని 8 భూములు, ముంబయి దాదర్‌లోని ఓ ఫ్లాట్‌ను జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈమేరకు చర్యలు చేపట్టింది.
ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్ రౌత్‌ను ఫిబ్రవరిలోనే అరెస్టు చేసింది ఈడీ. అనంతరం ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది. మరో మనీలాండరింగ్ కేసు పీఎంసీ బ్యాంక్ మోసానికి సంబంధించి సంజయ్ రౌత్ సతీమణి వర్షా రౌత్‌ను గతేడాదే ప్రశ్నించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ప్రవీణ్ రౌత్ భార్య మాధురితో వర్షాకు ఉన్న సంబంధాలపై ప్రశ్నలు సంధించింది. ఇప్పుడు వీరికి చెందిన రూ.11.5కోట్లు విలువ చేసే ఆస్తులను కూడా జప్తు చేసింది.