బంగాల్ బొగ్గు గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అనూప్ మాఝీకి చెందిన రూ.165 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం తెలిపారు. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద రెండు కంపెనీల భూములు, కర్మాగారాలు, యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
బొగ్గు కుంభకోణం- రూ.165 కోట్ల ఆస్తులు జప్తు - ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
బంగాల్ బొగ్గు స్కాంలో అనూప్ మాఝీకి చెందిన రూ.165 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది ఈడీ. రెండు కంపెనీల భూములు, కర్మాగారాలనూ స్వాధీనం చేసుకుంది.
బంగాల్ బొగ్గు కుంభకోణం- రూ.165 కోట్ల ఆస్తులు జప్తు
అక్రమంగా పొందిన సొమ్మును ఈ కంపెనీల్లో షేర్ల కొనుగోలు పేరిట మాఝీ వినియోగించినట్లు వివరించారు. ఈ కేసులో మాఝీని సీబీఐ ఇప్పటికే ప్రశ్నించింది.
ఇదీ చూడండి:ఒకే పాఠశాలలో 99 మంది విద్యార్థులకు కరోనా!