శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బంధువు ప్రవీణ్ రౌత్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసింది. మనీలాండరింగ్ వ్యతిరేక చట్టం కింద రూ.72 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. పీఎంసీ బ్యాంక్ రుణాల విషయంలో మోసం జరిగిందన్న కేసులో వీటిని అటాచ్ చేసింది.
సంజయ్ రౌత్ బంధువు ఆస్తులు జప్తు - Pravin Raut ₹ 72 crores properties
ఇటీవలే సంజయ్ రౌత్ భార్యకు సమన్లు జారీ చేసిన ఈడీ.. తాజాగా ఆయన బంధువు ప్రవీణ్ రౌత్ ఆస్తులను జప్తు చేసింది. పీఎంసీ బ్యాంక్ రుణాల మోసం కేసులో రూ. 72 కోట్లు విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది.
సంజయ్ రౌత్ బంధువు ఆస్తులు జప్తు
ఇటీవలే సంజయ్ రౌత్ భార్య.. వర్ష రౌత్‌కు ఈడీ నోటీసులు పంపించింది. పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్(పీఎంసీ) బ్యాంకు కుంభకోణం కేసు విషయంలో ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ ఎదుట వర్ష హాజరుకాలేదు.
ఇదీ చదవండి:భాజపా గూటి చిలుక 'ఈడీ': రౌత్