తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నీరవ్ మోదీకి షాకిచ్చిన ఈడీ! రూ.253.62 కోట్ల విలువైన ఆస్తులు జప్తు - నీరవ్ మోదీ న్యూస్

Nirav Modi News: రుణఎగవేతదారు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి సంబంధించిన ఆస్తులను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ జప్తు చేసింది. మోదీకి చెందిన సుమారు రూ.253.62 కోట్ల విలువైన ఆస్తులను హాంకాంగ్​లో జప్తు చేసింది.

Nirav Modi News
Nirav Modi News

By

Published : Jul 22, 2022, 8:23 PM IST

Nirav Modi News: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) షాక్ ఇచ్చింది. మోదీకి చెందిన సుమారు రూ.253.62 కోట్ల విలువైన ఆస్తులను హాంకాంగ్​లో జప్తు చేసింది. వీటితో పాటు ఎస్​ఏఆర్​, చైనాలోని నీరవ్ మోదీ గ్రూప్ కంపెనీలకు చెందిన ఆస్తులు జప్తు చేసినట్లు ప్రకటించింది. మనీలాండరింగ్​ చట్టం కింద జప్తు చేసినట్లు పేర్కొంది.

పలు బ్యాంకులను మోసం చేసిన వ్యవహారంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు దర్యాప్తు మొదలైయ్యే ముందే నీరవ్​ మోదీ దేశం విడిచి పరారయ్యారు. కాగా నీరవ్ మోదీ.. ప్రస్తుతం బ్రిటన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో అయన కంపెనీకి చెందిన అనేక ఆస్తులు, ఆభరణాలతో పాటు.. బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఇప్పటికే ఈడీ జప్తు చేసింది. నీరవ్ మోదీ, అతని కంపెనీ రూ. 6,498 కోట్ల 20 లక్షల మోసం వ్యవహారంలో కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details