ఝార్ఖండ్‌లోని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సంజీవని బిల్డ్‌కాన్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్బీపీఎల్)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కొరడా ఝుళిపించింది. సంస్థలో జరిగిన అక్రమ లావాదేవీలపై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి రూ.55.57కోట్ల విలువైన 101 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
సంజీవని బిల్డ్కాన్పై అంతకుముందు సీబీఐ.. రాంచీలో ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. ఈ మేరకు తనిఖీలు నిర్వహించినట్లు ఈడీ ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటికే రూ.3.10కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ సంస్థకు సంబంధించి రాంచీ, ఝార్ఖండ్ సహా.. ఇతర ప్రాంతాల్లోని మూడు వాణిజ్య సముదాయాలపై ఏకకాలంలో దాడులు జరిపినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ డైరెక్టర్లు వారి బంధువుల బ్యాంకు ఖాతాలపైనా సోదాలు చేసినట్లు ఈడీ పేర్కొంది.
''ఓపెన్ ప్లాట్లు, నిర్మించిన ఇళ్ల అమ్మకంపై వివిధ మీడియా ఛానెళ్లు, పత్రికా ప్రకటనల ద్వారా సంజీవని బిల్డ్‌కాన్ పెద్ద సంఖ్యలో ఝార్ఖండ్ ప్రజలను మోసం చేసినట్లు మా దర్యాప్తులో తేలింది. ఫలితంగా పెట్టుబడిదారుల నుంచి కంపెనీకి చెక్కు, నగదు చెల్లింపులు భారీగా వచ్చి చేరాయి.''