తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'శారద చిట్స్'​ కేసులో ఈడీ దూకుడు.. చిదంబరం భార్య సహా ఇద్దరు ముఖ్య నేతల ఆస్తులు అటాచ్ - బంగాల్​ శారదా చిట్​ ఫండ్​ కేసు

శారదా కుంభకోణానికి సంబంధించి రూ.6 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్​ చేసినట్లు ఈడీ తెలిపింది. తాము అటాచ్ చేసిన ఆస్తుల్లో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం భార్య నళిని, ఓ సీపీఎం ఎమ్మెల్యే, కాంగ్రెస్ మాజీ మంత్రి ఆస్తులు ఉన్నట్లు పేర్కొంది.

Enforcement Directorate
Enforcement Directorate

By

Published : Feb 3, 2023, 10:20 PM IST

శారదా గ్రూప్‌ కుంభకోణానికి సంబంధించి ఈడీ రూ.6 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం భార్య నళిని చిదంబరం, సీపీఎం ఎమ్మెల్యే దేబేంద్రనాథ్​ బిశ్వాస్, అసోం కాంగ్రెస్​ మాజీ మంత్రి అంజన్ దత్తా ఆస్తులు ఉన్నట్లు ఈడీ పేర్కొంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రూ.3.3 కోట్ల చరాస్తులను, రూ.3 కోట్ల స్థిరాస్తులను జప్తు చేసినట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆస్తులు శారదా గ్రూప్, ఇతర వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయని వెల్లడించింది. శారదా కుంభకోణం విచారణలో భాగంగా ఈడీ మనీలాండరింగ్‌ కింద కేసు నమోదు చేసింది.

బంగాల్ కేంద్రంగా ఉన్న శారదా గ్రూప్ డిపాజిటర్ల నుంచి రూ.2,459 కోట్లను సమీకరించగా.. వాటిలో రూ.1.983 కోట్లను ఇప్పటివరకు ఖాతాదారులకు చెల్లించలేదు. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు రూ. 600 కోట్ల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. శారదా కుంభకోణం 2013లో బయటపడింది.

ABOUT THE AUTHOR

...view details