తెలంగాణ

telangana

ETV Bharat / bharat

180 రోజుల్లోనే భూమిలో కలిసిపోయే ప్లాస్టిక్​ సంచులు - పర్యావరణ ప్లాస్టిక్ సంచులు

ప్లాస్టిక్‌ వినియోగం రోజురోజుకూ పెరిగిపొతోంది. ఎక్కడ చూసినా.. వాడి పడేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు తారసపడుతూనే ఉన్నాయి. ఫలితంగా పర్యావరణానికి హాని కలగడంతోపాటు జీవజాలానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో పర్యావరణ హిత ప్లాస్టిక్​ సంచులను తయారు చేసింది మైసూర్​లోని డిఫెన్స్ ఫుడ్​ రీసెర్చ్​ లేబొరేటరీ. ఇది చాలా చౌకగా ధరలో లభించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

dfrl mysore
పర్యావరణ రహిత ప్లాస్టిక్ సంచులు

By

Published : Jun 25, 2022, 8:00 PM IST

Updated : Jun 25, 2022, 8:45 PM IST

మట్టిలో కలిసిపోదు. నీటిలోనూ ఇంకిపోదు. అలాగే ఉంచితే ఆరోగ్యానికి ముప్పు. కాల్చితే ఇంకా ప్రమాదం. ప్లాస్టిక్‌ గురించే ఇదంతా. దశాబ్దాలుగా ప్లాస్టిక్ వినియోగం తీవ్రస్థాయికి చేరుకోవటం ఎన్ని సమస్యలు సృష్టిస్తోందో.. కళ్లకు కడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పర్యావరణ హిత ప్లాస్టిక్​ సంచులను తయారు చేసింది మైసూర్​లోని డిఫెన్స్ ఫుడ్​ రీసెర్చ్​ లేబొరేటరీ. ఈ సంచులు 180 రోజుల్లోనే భూమిలో కలిసిపోతాయని తెలిపారు పరిశోధకులు. ఈ సంచిలో 5కిలోల బరువున్న వస్తువులను తీసుకెళ్లవచ్చని వెల్లడించారు.

పర్యావరణ రహిత ప్లాస్టిక్ సంచులు

ఈ సంచుల​ను సహజంగా లభించే పాలీ లాక్టిక్ యాసిడ్ పాలీపెట్ నుంచి తయారు చేశారు. అదే సాంకేతికతతో లంచ్ ప్లేట్లు, స్పూన్లు, ఆహార వినియోగానికి వాడే ప్లాస్టిక్​ వస్తువులను తయారు చేస్తున్నారు. ఈ సంచుల తయారీకి డా.ఝాన్సీ పాల్, డా.పాల్ మురగన్ ఆధ్వర్యంలో 5 ఏళ్లు కష్టపడింది 15మంది శాస్త్రవేత్తల బృందం.

సాధారణంగా వస్త్రంతో తయారు చేసే సంచి ధర రూ.10 నుంచి రూ.15 రూపాయలు ఉంటుంది. డీఎఫ్‌ఆర్‌ఎల్ తయారు చేసిన ప్లాస్టిక్ బ్యాగ్ ధర కేవలం రూ.2 అని పరిశోధకులు తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చాముండి కొండకు 5,000 సంచులను పంపిణీ చేశామని అన్నారు. అలాగే శ్రీకంఠేశ్వర ఆలయం, శ్రీ రంగపట్టణ ఆలయంలో కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:బైక్​పై హెల్మెట్​ లేకుండా ఎమ్మెల్యే, మంత్రి.. రూ.1,000 ఫైన్ వేసిన ట్రాఫిక్​ పోలీస్​

'శివసేన బాలాసాహెబ్'​గా శిందే వర్గం.. రెబల్​ ఎమ్మెల్యేలపై ఠాక్రే చర్యలు

Last Updated : Jun 25, 2022, 8:45 PM IST

ABOUT THE AUTHOR

...view details