రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 23న బంగాల్‌కు వెళ్లే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. 294 స్థానాలకు ఎనిమిది దశల్లో ఈ నెల 27 నుంచి ఎన్నికలు ప్రారంభం కానున్న ఈ తరుణంలో ఈసీ ఎన్నికల సన్నాహాలను సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.
"ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఈసీ పూర్తి బెంచ్.. మార్చి 23న బంగాల్‌కు వెళ్లే అవకాశముంది. ఆ రాష్ట్ర సీనియర్ పాలనాధికారులతో భేటీ అవుతారు. ముఖ్యంగా మొదటి దశలో ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షిస్తారు" అని ఓ ఎన్నికల అధికారి తెలిపారు.