husband bite his wife nose: ఉత్తర్ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో ఓ భర్త ఆగ్రహంతో భార్య ముక్కును కొరికాడు. కొరిన్ పుర్వా గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో ఈ ఘటన జరిగింది. భార్యతో గొడవపడిన భర్త.. ఆమెను తీవ్రంగా కొట్టాడు. తర్వాత ఆమె ముక్కును కొరికాడు. దీంతో రక్తస్రావమైన ఆమె అక్కడే పడిపోయింది. దీనిపై మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గొడవపడి భార్య ముక్కు కొరికిన భర్త - ఉత్తర్ప్రదేశ్ న్యూస్
husband bite his wife nose: ఓ భర్త తన భార్య పై దాడి చేసి.. ఏకంగా ఆమె ముక్కును కొరికాడు. భార్యతో గొడవపడి ఆగ్రహంతో ఈ చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ బహ్రైచ్లో జరిగింది.
husband cut his wife nose:
రమావతి అనే మహిళ ఫఖర్పుర్ పోలీస్ స్టేషన్ పరిధి సిరౌలి కల గ్రామంలో నివసిస్తోంది. తన భర్త హరిరామ్ సోదరి కుమార్తె వివాహానికి హాజరయ్యింది. వివాహం పూర్తైన అనంతరం జరిగిన ఊరేగింపులో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో చుట్టు ఉన్నవారు భర్తను శాంతపరిచే ప్రయత్నం చేసిన హరిరామ్ వినలేదు. కోపంతో ఉన్న భర్త .. భార్య రమావతిని కొట్టాడు. తర్వాత ఆమె ముక్కును కొరికాడు.
ఇదీ చదవండి:బొమ్మకు ఉరివేసి 8ఏళ్ల బాలుడి సూసైడ్.. ఆ వీడియో చూసే!