తెలంగాణ

telangana

ఎన్నికల ముందు బంగాల్‌ డీజీపీ బదిలీ

By

Published : Mar 9, 2021, 10:15 PM IST

బంగాల్​ డీజీపీ వీరేంద్రను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డీజీపీ బదిలీ ప్రాధాన్యం సంతరించుకుంది.

EC transfers Bengal DGP Virendra ahead of assembly election
ఎన్నికల ముందు బెంగాల్‌ డీజీపీ బదిలీ

బంగాల్‌లో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర డీజీపీ వీరేంద్రను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆయన స్థానంలో 1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి పి.నీరజ్‌ నయన్‌ను నియమించింది.

ఎన్నికల సన్నద్ధతలో భాగంగా రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ కార్యదర్శి రాకేశ్ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వీరేంద్రకు ఎలాంటి బాధ్యతలూ అప్పగించలేదు.

బంగాల్‌లో ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌ 29 వరకు ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి:బంగాల్​ దంగల్​: 'ఛాయ్​'వాలాగా మారిన దీదీ

ABOUT THE AUTHOR

...view details