తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రచారంలో కొవిడ్​ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు - central election commission latest news

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొవిడ్​ నిబంధనల అమలు తీరుపై అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

election commission of india
బంగాల్​ ఎన్నికల ప్రచారంపై సీఈసీ సమీక్ష

By

Published : Apr 24, 2021, 3:13 PM IST

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొవిడ్​ నిబంధనల అమలు తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సమీక్ష నిర్వహించింది. బంగాల్​లో వచ్చే వారంలో మిగతా రెండు విడతల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అధికారులతో ప్రధాన ఎన్నికల కమిషనర్​ సుశీల్​ చంద్ర, ఎన్నికల కమిషనర్​ రాజీవ్​ కుమార్​ శనివారం సమావేశమయ్యారు.

బంగాల్​ ఎన్నికల ప్రధాన కార్యదర్శి, పోలీస్​ చీఫ్​, ఆరోగ్య కార్యదర్శి, కోల్​కతా పోలీస్​ కమిషనర్​.. ఈ సమావేశంలో పాల్గొన్నట్లు ఈసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కొవిడ్​ నిబంధనలు ఉల్లంఘించేవారిపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఈసీ ఆదేశించినట్లు చెప్పారు.

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కొవిడ్​ నిబంధనలను అమలు చేయటంలో ఈసీ తీరుపై కోల్​కతా హైకోర్టు గురువారం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. సీఈసీ సమీక్షా సమావేశం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు.. బంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘంఇటీవల ఆంక్షలు విధించింది. బహిరంగ సభలకు 500 మందిని మాత్రమే అనుమతించాలని సూచించింది. పాదయాత్రలు, రోడ్‌ షోలపై నిషేధం విధించింది.

ఇదీ చూడండి:పోలీస్ స్టేషన్​లోనే కానిస్టేబుల్ 'హల్దీ' వేడుక

ఇదీ చూడండి:బంగాల్​: ఎనిమిదో దశలో 23% మందికి నేరచరిత

ABOUT THE AUTHOR

...view details