బంగాల్ సీఎం మమతా బెనర్జీకి.. కేంద్ర ఎన్నికల సంఘం ఘాటు లేఖను పంపింది. అధికార పార్టీకి ఈసీ మద్దతుగా వ్యవహరిస్తోందంటూ పదేపదే ఆమె ఆరోపించటాన్ని ఈసీ తప్పుపట్టింది. ఇది రాజ్యంగబద్ధ సంస్థలను తక్కువ చేయటమేనని మండిపడింది.
మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మమత.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి ఎన్నికల కమిషన్ సలహాలు తీసుకుంటోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం విధుల్లో భాజపా జోక్యం చేసుకోవడం కొనసాగిస్తే.. ఈసీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.