EC Suspends Musheerabad Police Officers :విధి నిర్వహణలో పక్షపాతం, నిర్లక్ష్యం వహించారని ఈసీ(ECI) ఆదేశాల మైరకు.. హైదరాబాద్‌లో ముగ్గురు పోలీసు అధికారులను సీఎస్ సస్పెండ్ చేశారు. సప్పెండ్ అయిన వారిలో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ ఇన్పెక్టర్ జహంగీర్లు ఉన్నారు. నిన్న ఎన్నికల తనిఖీల్లో ఉన్న ఫ్లైయింగ్ స్క్వాడ్ ముషీరాబాద్‌లోని.. సంతోష్ ఎలైట్ అపార్ట్మెంట్లో డబ్బులు పంచుతున్నారని సమాచారం వచ్చింది. అక్కడి చేరుకున్న ఎఫ్ఎస్టి బృందాన్ని చూసి స్థానికులు పరారయ్యారు.
విధుల్లో పక్షపాతం వహించారని- ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు
Published : Nov 29, 2023, 8:01 PM IST
|Updated : Nov 29, 2023, 9:19 PM IST
19:51 November 29
విధుల్లో పక్షపాతం వహించారని- ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు
ఖాకీ నిఘాలో పోలింగ్ కేంద్రాలు- లక్షమందితో పటిష్ఠ బందోబస్తు
Telangana Assembly Elections 2023 :అక్కడే నిలిపి ఉన్న AP 28 CH 6759 నంబరు గల కారులో 18లక్షలు, చెక్‌బుక్, 2సెల్ఫోన్లను ముషీరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కారు, నగదు ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధి ముఠా గోపాల్ కుమారుడు ముఠా జైసింహదిగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు మాత్రం గుర్తు తెలియని వారివిగా నమోదు చేశారు. సెక్షన్లు కూడా సరైనవి పెట్టలేదు. కాగా ఈ విషయంపై సీపీ సందీప్ శాండిల్యా ఆరా తీయగా.. సదరు కేసులో ముఠా గోపాల్ స్నేహితులు సంతోష్, సుధాకర్‌ను అరెస్ట్ చేసినట్లు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు.
దీంతో ఘటనపై దృష్టి సారించిన ఈసీ.. ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేయాలని సీఎస్‌ను ఆదేశించింది. దీంతో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ముషీరాబాద్ ఇన్పెక్టర్గా అదే స్టేషన్లో పనిచేసే డీఐ వెంకట్ రెడ్డి నియామిస్తూ హైదరాబాద్ సీపీ ఉత్తర్వులిచ్చారు. సెంట్రల్ జోన్ డీసీపీగా ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ డీసీపీ నితిక పంత్ లేదా ట్రాఫిక్ డీసీపీ -2 గా ఉన్న అశోక్ కుమార్, లేదా ట్రాఫిక్ డీసీపీ-3 గా ఉన్న డి శ్రీనివాస్ లను నియమించే అవకాశం ఉందని తెలిపారు. చిక్కడ పల్లి ఏసీపీగా ఎన్నికల కోడ్‌లో బదిలీ కాని అధికారి నియమితులు అవుతారని సీపీ శాండిల్య వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌కు రంగం సిద్ధం - పూర్తైన ఎన్నికల సామగ్రి పంపిణీ