తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎన్నికల షెడ్యూల్​ను కుదించటం సాధ్యం కాదు'

కరోనా దృష్ట్యా బంగాల్​లో ఎన్నికల షెడ్యూల్​ను కుదించాలంటూ అధికార టీఎంసీతో పాటు కాంగ్రెస్ పార్టీ చేసిన అభ్యర్థనలను ఎన్నికల కమిషన్​ కొట్టిపారేసింది. షెడ్యూల్​ను కుదించటం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అది ఎన్నికల ప్రవర్తనా నియామావళిపై ప్రభావం చూపుతాయని వివరించింది.

EC
ఎన్నికల కమిషన్

By

Published : Apr 21, 2021, 10:38 PM IST

కొవిడ్​ నేపథ్యంలో బంగాల్​లో పోలింగ్​ను కుదించాలంటూ టీఎంసీ, కాంగ్రెస్​ పార్టీలు చేసిన అభ్యర్థనలను ఎన్నికల కమిషన్ కొట్టిపారేసింది. ఎన్నికల షెడ్యూల్​ను కుదించటం సాధ్యమయ్యే పని కాదని స్పష్టం చేసింది. అది ఎన్నికల ప్రవర్తనా నియామావళిపై ప్రభావం చూపుతాయని వివరించింది. బంగాల్​లో మిగతా దశల పోలింగ్​ను రంజాన్​ మాసం తర్వాత నిర్వహించాలని బంగాల్​ కాంగ్రెస్ ప్రతినిధి అధీర్​ రంజన్​ చౌదరీ చేసిన అభ్యర్థనను సైతం ఈసీ తోసిపుచ్చింది.

" ప్రస్తుతం ఉన్న ఎన్నికల షెడ్యూల్​ను మార్చినా, వాయిదా వేసినా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి రాజ్యాంగ బద్ధమైన నిబంధనలనపై ప్రభావం పడుతుంది."

-- ఎన్నికల కమిషన్

తృణమూల్ కాంగ్రెస్ నేత దెరేక్ ఒబేరాయ్​.. బంగాల్​ ఎన్నికల అధికారికి రాసిన లేఖపై స్పందించింది ఈసీ. కరోనా దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు చేపట్టిందో వివరించింది. బంగాల్​ మిగిలిన ఎన్నికల దశలను కుదించి.. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలని ఒబేరాయ్​.. ఎన్నికల అధికారులకు లేఖ రాశారు. రాజకీయ పార్టీలకు 52 రోజులు ప్రచార సమయం లభించిందన్నారు.

బంగాల్​లో ఆరో దశ ఎన్నికలు గురువారం జరగనుండగా, ఏడు, ఎనిమిదో దశ ఎన్నికలు ఏప్రిల్ 26, 29 న జరగనున్నాయి.

ఇదీ చదవండి : 'చేతులు జోడించి అడుగుతున్నా.. పోలింగ్​ కుదించండి'

ABOUT THE AUTHOR

...view details