'పంజాబ్ లోక్ కాంగ్రెస్' పేరిట రాజకీయ పార్టీని నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ దరఖాస్తు అందింది. దీనిని ఈసీ పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
"ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓ అసోసియేషన్‌ను పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో పొలిటికల్ పార్టీగా గుర్తించాలని ఆ సంస్థ దరఖాస్తు చేసుకుంది. దీనిని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది."
- సంబంధిత వర్గాలు
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఇదే పేరుతో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ (amarinder singh news) పార్టీని స్థాపించినట్లు ప్రకటించారు.
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విభేదాల నేపథ్యంలో సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కెప్టెన్ అమరీందర్. ఈ క్రమంలోనే గాంధీ కుటుంబం తనను అవమానించిందని ఆరోపించారు. దీంతో 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' (amarinder singh party) పేరిట సొంత పార్టీని ప్రకటించారు. అయితే.. ఈసీకి అందిన దరఖాస్తుకు, అమరీందర్‌కు సంబంధం ఉందా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
ఇదీ చూడండి:హైవేపై దిగిన మూడు యుద్ధవిమానాలు- ఎందుకంటే?