తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నేటి నుంచి ఎగ్జిట్​ పోల్స్​ బంద్​' - exit polls ban news

శనివారం నుంచి ఏప్రిల్​ 29 వరకు ఎగ్టిట్​ పోల్స్​ నిర్వహణ, ఫలితాల వెల్లడిపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది.

election commission of india
'నేటి నుంచి ఎగ్జిట్​ పోల్స్​ బంద్​'

By

Published : Mar 27, 2021, 5:44 AM IST

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఎగ్జిట్​ పోల్స్​ నిర్వహణ, ఫలితాలు వెల్లడిపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి(శనివారం) ఉదయం 7 గంటల నుంచి ఏప్రిల్​ 29 రాత్రి 7:30 గంటల వరకు ఈ నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. కేంద్ర పాలిత ప్రాతం పుదుచ్చేరి సహా తమిళనాడు, కేరళ, బంగాల్​, కేరళ రాష్ట్రాలకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది.

అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గానూ 47 సీట్లకు.. బంగాల్‌లో 294 స్థానాలకుగాను 30 సీట్లకు తొలిదశ పోలింగ్ నేడు జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details