తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​- ఉపఎన్నికలు వాయిదా - కరోనా పరిస్థితి

దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా.. 3 లోక్​సభ, 8 అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేసింది ఎన్నికల సంఘం. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

EC
ఎన్నికల సంఘం

By

Published : May 5, 2021, 10:24 PM IST

కరోనా సెకండ్‌ వేవ్‌ దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు కారణాల వల్ల ఖాళీ అయిన అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో కరోనా పరిస్థితిపై సమీక్షించిన ఈసీ.. పరిస్థితులు మెరుగుపడే వరకు ఉప ఎన్నికలు నిర్వహించరాదని నిర్ణయించినట్టు పేర్కొంది.

దేశంలో దాద్రా నగర్‌హవేలీ, ఖండ్వా (మధ్యప్రదేశ్‌), మండి (హిమాచల్‌ ప్రదేశ్‌) లోక్‌సభ స్థానాలతో పాటు పలు రాష్ట్రాల్లోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు ఈసీ ఇప్పటికే నోటిఫై చేసింది. ఏపీలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కల్కా, ఎలియాబాద్‌ (హరియాణా) వల్లభ్‌నగర్ (రాజస్థాన్‌)‌, సిండ్గి (కర్ణాటక), రాజబల, మారైంగ్‌కెంగ్‌ (మేఘాలయా), ఫతేపూర్‌ (హిమాచల్‌ప్రదేశ్‌)లలో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. సంబంధిత రాష్ట్రాల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత పరిస్థితిపై సమీక్షించి తగిన సమయంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్టు ఈసీ తెలిపింది. కడప జిల్లాలోని బద్వేల్​లో వైకాపా ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య మార్చి నెలాఖరున అనారోగ్యంతో మృతి చెందగా.. ఆ స్థానం ఖాళీ అయింది.

ఇదీ చూడండి:తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్

ABOUT THE AUTHOR

...view details