EC meeting health ministry: కేంద్ర ఆరోగ్య శాఖతో ఎన్నికల సంఘం(ఈసీ) సమావేశమైంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను సమీక్షించేందుకు ఎన్నికస సంఘం అధికారులు- ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలా? వాయిదా వేయాలా? అనే అంశంపై కూడా వారు చర్చించే అవకాశం ఉంది.
Covid in poll-bound states: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపుర్ రాష్ట్రాల్లోని కొవిడ్ పరిస్థితులను ఈసీకి రాజేశ్ భూషణ్ వివరించడం ఇది రెండోసారి. అంతకుముందు డిసెంబరు 27న జరిగిన భేటీలో కరోనా పరిస్థితులను ఈసీకి ఆయన వివరించారు. ఆ సమయంలో... ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది.