డీఎంకే నాయకుడు, స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఎన్నికల కమిషన్(ఈసీ) నోటీసులు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఒత్తిడి తట్టుకోలేకే అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ మరణించారని ఆయన చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని కోరింది. చెపాక్ ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగిన ఆయన.. ప్రచారంలో భాగంగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఉదయనిధి వ్యాఖ్యలపై ఈసీ నోటీసులు - నరేంద్ర మోదీ నుంచి ఒత్తిడి తట్టుకోలేకే అరుణ్ జైట్లీ, సుష్మ స్వరాజ్ మరణించారన్న ఉదయనిధి
ప్రధాని మోదీ నుంచి ఒత్తిడి తట్టుకోలేకే అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ మరణించారన్న వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. అయితే, ఈసీ ఆరోపణలను ఖండించిన ఉదయనిధి.. తాను మాట్లాడిన సందర్భం వేరని లిఖితపూర్వక సమాధానం పంపారు.
నోటీసులపై స్పందించి.. లిఖితపూర్వక సమాధానాన్ని ఈసీకి పంపారు ఉదయనిధి స్టాలిన్. తాను మాట్లాడిన మొత్తం ప్రసంగాన్ని ఈసీ పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. ప్రసంగంలో నుంచి రెండు లైన్లను మాత్రమే తీసుకొని నోటీసులు జారీ చేశారని చెప్పారు. 'మొత్తం ప్రసంగాన్ని గమనించినప్పుడు ఏ సందర్భంలో ఆ మాటలు చెప్పాల్సి వచ్చింది?, దాని అర్థం ఏంటో తెలుస్తుంది' అని వివరణ ఇచ్చారు. వివాదాస్పదంగా భావించిన ప్రసంగం పూర్తి ట్రాన్స్‌స్క్రిప్ట్‌ను పంపిస్తే.. సవివర సమాధానం ఇస్తానని చెప్పారు.
ఇదీ చదవండి:'షా ఆదేశాలతోనే.. ఓటర్లపై జవాన్ల వేధింపులు'