తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బైక్​పై 18 కిలోల బంగారం స్మగ్లింగ్​ - తిరువారుర్​ జిల్లాలో బంగారం అక్రమ రవాణా

తమిళనాడులో అక్రమంగా తరలిస్తున్న 18 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు అధికారులు. తిరువారుర్​ జిల్లాలో ఓ ద్విచక్రవాహనదారుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.

squad seizes 18kg gold at Thiruvarur
18 కిలోల బంగారం అక్రమ రవాణా పట్టివేత

By

Published : Mar 10, 2021, 8:30 AM IST

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో బంగారం అక్రమ రవాణా ఉదంతాలు బయటపడుతున్నాయి. తాజాగా.. తిరువారుర్​ జిల్లాలో ఓ ద్విచక్ర వాహనదారుడి వద్ద నుంచి 18 కిలోల బంగారాన్ని ఫ్లయింగ్​ స్క్వాడ్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.6.5 కోట్లు ఉంటుందని చెప్పారు.

మత్తుపెట్టాయ్​ చెక్​పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఈ బంగారం బయటపడినట్లు అధికారులు పేర్కొన్నారు. బంగారం తరలిస్తున్న వ్యక్తి వద్ద అందుకు సంబంధించి సరైన పత్రాలు లేనందున వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల్ని పోలింగ్​ అధికారులకు అందజేస్తున్న ఫ్లయింగ్​ స్క్వాడ్​ అధికారులు

జప్తు చేసిన బంగారు ఆభరణాలను తిరుతురైపూండి పోలింగ్ అధికారులకు పోలీసులు అందజేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

ఇదీ చూడండి:'బంగారం స్మగ్లింగ్ ఉగ్రవాద చర్యేనా?'

ABOUT THE AUTHOR

...view details