Eat rat poison Nagpur: చాక్లెట్ అనుకొని ఎలుకల మందును తిని ఓ నాలుగేళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని జై గురుదేవ్ నగర్లో జరిగింది. మూషికాలను నివారించేందుకు ఇంట్లో పెట్టిన ఎలుకల మందు తమ బిడ్డ ప్రాణం తీస్తుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు.
చాక్లెట్ అనుకొని ఎలుకల మందు తిని.. పాపం చిన్నారి! - నాగ్‌పుర్‌లో ఎలుకల మందు తిని నాలుగేళ్ల బాలిక మృతి
Eat rat poison Nagpur: మహారాష్ట్రలో విషాదకర ఘటన జరిగింది. చాక్లెట్ అనుకొని ఎలుకల మందు తిని నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
అసలేం జరిగిదంటే: ఎలుకల బెడద ఎక్కువగా ఉండడం వల్ల వాటిని నివారించేందుకు మృతురాలు గుంజన్ నిలేశ్(4) ఇంట్లో ఎలుకల మందు పెట్టారు. బొమ్మతో ఆడుకుంటూ.. చాక్లెట్ ఆకారంలో ఉన్న ఆ మందును చిన్నారి తినేసింది. వెంటనే ఆమె అసౌకర్యంగా ఉండడం వల్ల తల్లి ప్రశ్నించింది. ఆ బాలిక చాక్లెట్ తిన్నానని చెప్పింది. వాంతులు చేసుకోవడం వల్ల.. ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుంజన్ మృతిచెందింది. దీంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.
ఇదీ చదవండి:ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు షాక్.. 14 రోజులు జైలులోనే!