'బీఫ్ తినండి..' అంటూ ఓ భాజపా మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భాజపా సిద్ధాంతాలకు ఈ వ్యాఖ్యలు వ్యతిరేకంగా ఉండటమే కాకుండా.. ఇందుకు ఆయన ఇచ్చిన వివరణ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
'చికెన్.. మటన్.. వద్దు'
మేఘాలయ కేబినెట్లో గత వారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శాన్బోర్ షుల్లాయ్.. ఇది ప్రజాస్వామ్య దేశమని.. అందువల్ల ఎవరికి నచ్చింది వారు తినే స్వేచ్ఛ ఉందని తెలిపారు. అయితే చికెన్, మటన్, ఫిష్ బదులు బీఫ్ తినాలని ప్రోత్సహించారు.
"చికెన్, మటన్, ఫిష్ బదులు బీఫ్ తినాలని నేను ప్రజలకు పిలుపునిస్తున్నాను. ఇలా చేస్తే.. గో వధపై భాజపా నిషేధం విధిస్తుందన్న భావన తొలిగిపోతుంది."