తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'యాస్​' హెచ్చరికలతో రైళ్లు రద్దు - రైల్వే శాఖపై యాస్​ ప్రభావం

రాకాసి తుపాను కారణంగా.. తూర్పు రైల్వేలో పలు రైళ్ల సర్వీసులను నిలిపివేస్తున్నట్టు రైల్వేశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అతి తీవ్ర తుపానుగా మారనున్న నేపథ్యంలో.. ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తూర్పు రైల్వే శాఖ పేర్కొంది.

Eastern Railway, Railway board
తూర్పు రైల్వే, రైల్వే శాఖ

By

Published : May 24, 2021, 7:59 AM IST

'యాస్​' తుపాను కారణంగా.. సోమవారం(ఈ నెల 24) నుంచి మే 29 వరకు 25 రైళ్లను రద్దు చేసినట్టు తూర్పు రైల్వే తెలిపింది. రద్దైన రైలు సర్వీసుల వివరాల జాబితాను ప్రకటనలో పొందుపర్చింది.

రద్దైన రైలు సర్వీసుల వివరాలు

శనివారం ఉదయం తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. మరింత తీవ్రరూపం దాల్చనుంది. సోమవారం నాటికి ఇది 'యాస్​' తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ తుపాను మే 26న సాయంత్రం బంగాల్​, ఉత్తర ఒడిశా తీరాలను దాటనుందని వాతావరణ విభాగం పేర్కొంది. దీని ప్రభావంతో గంటకు 155-165 కిలోమీటర్ల నుంచి 185 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఈ గాలులు 'తౌక్టే' తుపాను సృష్టించిన గాలి వేగానికి దాదాపు సమానంగా ఉంటాయని, గతేడాది 'అంఫన్​' తుపాను కూడా ఇదే తరహా బీభత్సం సృష్టంచిందని వాతావరణ విభాగం తెలిపింది.

రాకాసి తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో.. దాని వల్ల తలెత్తే విపత్తును పరిష్కరించేందుకు రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించడానికి అధికారులు, మంత్రులతో ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఇదీ చదవండి:యాస్​ తుపాను: రంగంలోకి హెలికాప్టర్లు, విమానాలు

ABOUT THE AUTHOR

...view details