తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ladakh standoff: చైనాతో చర్చలు కొనసాగుతాయి: రాజ్​నాథ్​ సింగ్ - లద్దాఖ్ ప్రతిష్టంభన

తూర్పు లద్దాఖ్​లో చైనాతో కొనసాగుతున్న సరిహద్దు ప్రతిష్టంభన (ladakh standoff latest news) శాంతియుతంగానే పరిష్కారమవుతుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇరుదేశాల సైనికాధికారులు జరుపుతున్న చర్చలు ఇక ముందు కూడా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

rajnath on ladakh standoff
లద్దాఖ్ ప్రతిష్టంభన

By

Published : Oct 28, 2021, 3:12 AM IST

లద్దాఖ్​ సరిహద్దు ప్రతిష్టంభన అంశంపై శాంతియుత (ladakh standoff latest news) పరిష్కారం కోసం చైనాతో చర్చలు కొనసాగుతాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో సరిహద్దు రక్షణకు సైన్యం దృఢనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. దేశ భద్రతా సవాళ్లపై గత సోమవారం మొదలైన మిలిటరీ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో రాజ్​నాథ్ మాట్లాడారు

సైన్యానికి కావల్సిన ఆయుధ సామగ్రిని, మౌలిక సదుపాయాలను సమకూర్చడం దేశ బాధ్యతగా పేర్కొన్నారు రాజ్​నాథ్​. జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదాన్ని అరికట్టడానికి సైన్యం చేస్తున్న కృషిని కొనియాడారు.

భారత్-చైనా సైనికాధికారులు 13వ సారి సమావేశమైన రెండు వారాల తర్వాత చర్చలపై రాజ్​నాథ్​ సింగ్ స్పందించారు. చైనా సైనికాధికారులతో భారత సైన్యం జరిపిన చర్చలు ఈ సారి కూడా ఫలవంతం కాలేదు. భారత్ ప్రతిపాదించిన ఏ అంశాన్ని చైనా అంగీకరిచలేదు. సమస్య పరిష్కారానికి చైనా ఏ ప్రతిపాదనను ముందుకు తీసుకురాలేదు.

ఇదీ చదవండి:'అగ్ని-5' క్షిపణి ప్రయోగం విజయవంతం

'పీఓకే గురించి ఇంకా ప్లాన్ చేయలేదు.. కానీ త్వరలోనే..'

ABOUT THE AUTHOR

...view details