తూర్పు లద్దాఖ్‌లోని ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద నుంచి బలగాల ఉపసంహరణ త్వరగా చేపట్టాలని చైనాతో జరిగిన 13వ విడత కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల్లో (India China Commander Level Talks) భారత్ పట్టుబట్టింది. చైనా వైపున ఉన్న చుషూల్ మోల్డో సరిహద్దు వద్ద ఉదయం పదిన్నరకు ప్రారంభమైన సమావేశం రాత్రి ఏడు గంటల వరకూ కొనసాగింది. సుమారు ఎనిమిదిన్నర గంటల పాటు జరిగిన చర్చల్లో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద నుంచి బలగాల ఉపసంహరణను పూర్తిచేయడమే ప్రధాన అజెండాగా చర్చించినట్లు సమాచారం.
'తొందరగా బలగాలను ఉపసంహరించండి' - india-china border issue latest news
సరిహద్దుల్లోని దెప్సాంగ్ సహా ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ (Eastern Ladakh Standoff) ప్రక్రియను వేగవంతం చేయాలని చైనాకు ఆదివారం జరిగిన 13వ విడత కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల్లో భారత్ స్పష్టం చేసింది. చైనా వైపు ఉన్న మోల్డో బార్డర్ పాయింట్లో ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు సాయంత్రం ఏడు గంటల వరకు సాగాయి.
ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగు పడాలంటే దెప్సాంగ్ సహా అన్ని ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద నుంచి బలగాల ఉపసంహరణ (Eastern Ladakh Standoff) అవసరమని భారత్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చలకు సంబంధించి భారత సైన్యం నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. చైనా బలగాలు ఇటీవల సరిహద్దులు దాటి ఉత్తరాఖండ్ లోని బారాహోతీ సెక్టార్, అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లలోకి ప్రవేశించిన నేపథ్యంలో జరుగుతున్న ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చూడండి:కశ్మీర్లో 40 మంది టీచర్లకు సమన్లు.. 400 మంది అనుమానితుల అరెస్ట్!