అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ సియాంగ్ జిల్లాలో గురువారం ఉదయం 10.31 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయని జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి తెలిపారు. అయితే ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదనిన జిల్లా విపత్తు నిర్వహణ అధికారి (డీడీయంఓ) నిమా దోర్జీ చెప్పారు.
మరోవైపు..నేపాల్లోనూ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత నమోదైంది. బుధవారం 6.6 రిక్టర్ స్కేలు రీడింగ్‌తో భారీ భూకంపం సంభవించి, ఆరుగురు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మళ్లీ ఈ రోజు పశ్చిమ నేపాల్‌లో భూమి కంపించింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. అదృష్టవశాత్తూ...
అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ సియాంగ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైంది. అయితే ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని జిల్లా విపత్తు అధికారి తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం
Last Updated : Nov 10, 2022, 3:06 PM IST