తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా సెకండ్​ వేవ్​ తగ్గుముఖం!'

దేశంలో కరోనా కొత్త కేసులు, మరణాల్లో తగ్గుదల నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా సెకండ్​ వేవ్​ తగ్గుముఖం పడుతుందనేందుకు ఇది సంకేతమని అభిప్రాయపడింది.

new COVID-19 cases
కరోనా సెకండ్​ వేవ్​ తగ్గుముఖం!

By

Published : May 11, 2021, 6:02 PM IST

Updated : May 11, 2021, 7:24 PM IST

దేశంలో కరోనా సెకండ్​ వేవ్ తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసులు, మరణాల సంఖ్యలో క్షీణతను గమనిస్తే ఇది స్పష్టమవుతోందని పేర్కొంది. మహారాష్ట్ర, ఉత్తర్​ప్రదేశ్, దిల్లీ, ఛత్తీస్​గఢ్ వంటి రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని పేర్కొంది. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇదే ట్రెండ్​ కొనసాగుతోంది చెప్పింది.

అయితే కర్ణాటక, కేరళ, తమిళనాడు, బంగాల్, పంజాబ్​ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని ఆరోగ్య శాఖ తెలిపింది. 13 రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించింది. 26 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతానికి పైగా ఉందని పేర్కొంది.

రెండో డోసుకే ప్రాధాన్యం..

వ్యాక్సినేషన్​లో కరోనా టీకా రెండో డోసు తీసుకోవాల్సిన వారికే ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు సూచించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులతో టీకా పంపిణీపై సమీక్ష నిర్వహించారు. రెండో డోసు కోసం వేచి చూసే వారందరికీ అత్యవసరంగా టీకా అందించాలన్నారు. కేంద్రం రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేసే టీకాల్లో 70 శాతాన్ని రెండో డోసు కోసం వినియోగించాలని, మిగతా 30 శాతాన్ని తొలి డోసు తీసుకునే వారి కోసం కేటాయించాలని పేర్కొన్నారు.

టీకాలు వృథా కానివ్వొద్దు..

టీకాలు వృథా కాకుండా చూడాలని ఆయా రాష్ట్రాలకు సూచించారు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి. కొన్ని రాష్ట్రాల్లో వృథా తగ్గిందని, ఇంకా పలు రాష్టాలు మాత్రం టీకా నిర్వహణలో మెరుగుపడాలని తెలిపారు.

ఇదీ చూడండి:వైన్ షాపుల వద్ద మందుబాబుల బారులు

Last Updated : May 11, 2021, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details