తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆవిష్కరణలకు మరింత స్వేచ్ఛ ఇచ్చేందుకే సంస్కరణలు' - ఇండియన్ స్పేస్​​ అసోసియేషన్

గతంలో అంతరిక్ష రంగం అంటే ప్రభుత్వానికి పర్యాయపదంగా ఉండేదని, ఆ ఆలోచనా విధానాన్ని తాము మార్చామని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi News) అన్నారు. ప్రైవేటు సెక్టార్​లో ఆవిష్కరణలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇండియన్ స్పేస్​​ అసోసియేషన్ (Indian space association) ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ వర్చువల్​గా పాల్గొని మాట్లాడారు. అత్యంత నిర్ణయాత్మక ప్రభుత్వం తమదేనని చెప్పారు.

modi news
మోదీ

By

Published : Oct 11, 2021, 12:25 PM IST

Updated : Oct 11, 2021, 1:02 PM IST

ఇండియన్ స్పేస్ అసోసియేషన్​(Indian space association) ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్చువల్​గా పాల్గొని ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi News). గతంలో అంతరిక్ష రంగం అంటే ప్రభుత్వానికి పర్యాయపదమని, ఆ ఆలోచనా విధానాన్ని తాము మార్చామని తెలిపారు. ప్రైవేటు సెక్టార్​లో ఆవిష్కరణలకు మరింత స్వేచ్ఛ ఇచ్చేందుకు అంతరిక్ష రంగంలో సంస్కరణలు తీసుకొచ్చినట్లు మోదీ తెలిపారు. ప్రభుత్వానికి అంకుర సంస్థలకు మధ్య సహకార మంత్రంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. యువత భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకునే అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించాలనే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అత్యంత నిర్ణయాత్మక ప్రభుత్వం తమదేనని మోదీ(Modi latest news) చెప్పుకొచ్చారు.

ఆత్మనిర్భర్ భారత్​ లక్ష్య సాధనలో భాగంగాగానే ప్రభుత్వం సంస్కరణలు తీసుకొస్తున్నట్లు మోదీ(modi news today) స్పష్టం చేశారు. ఇది విజన్ మాత్రమే కాదని, సమగ్ర ఆర్థిక వ్యూహమని వివరించారు. ప్రస్తుతం ప్రపంచ అభివృద్ధికి ఇదే కారణమన్నారు. ప్రైవేటీకరణకు తమ ప్రభుత్వం ఎంత తీవ్రంగా కట్టుబడి ఉందో చెప్పేందుకు నష్టాల్లో ఉన్న ఎయిర్​ ఇండియాపై తాము తీసుకున్న నిర్ణయమే నిదర్శమని మోదీ అన్నారు. అంతరిక్షం, రక్షణ రంగంలో ప్రవేటు సంస్థలను భాగస్వాములుగా చేయడానికి జాతీయ ప్రయోజనాలతో పాటు అవసరాలు కారణమన్నారు. అంతరిక్ష రంగంలో ఎండ్​ టు ఎండ్​ సాంకేతికత కలిగి ఉన్న అతికొద్ది దేశాల్లో భారత్​ ఒకటని మోదీ చెప్పారు.

" నాలుగు మూల స్తంభాల ఆధారంగా అంతరిక్షంలో సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రేవేటు రంగంలో సంస్కరణలకు స్వేచ్ఛఇవ్వడం, అవకాశం కల్పించే పాత్రంలో ప్రభుత్వం ఉండటం, భవిష్యత్తుకు యువతను సన్నద్ధం చేయటం, సామాన్యుడి అభివృద్ధికి అంతరిక్షం వనరుగా ఉండటం."

-ప్రధాని మోదీ.

సాంకేతికతలో స్వయం సమృద్ధ భారత్​ లక్ష్యాన్ని చేరుకునేందుకు, అంతరిక్ష రంగంలో అందరికన్నా ముందుండేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తామని ఇండియన్ స్పేస్ అసోసియేషన్ తెలిపింది(indian space association inauguration). అంతరిక్షం, ఉపగ్రహ సాంకేతికతలలో అత్యాధునిక సామర్థ్యాలు కలిగి ఉండాలనే లక్ష్యంతో ఇండియన్ స్పేస్​ అసోసియేషన్​ను(indian space association) ఏర్పాటు చేశారు. దీని వ్యవస్థాపక సభ్యుల్లో లార్సన్ అండ్​ టర్బో, నెల్కో(టాటా గ్రూప్), వన్​వెబ్, భారతీ ఎయిర్​టెల్​, మ్యాప్​మైఇండియా, వాల్​చంద్​నగర్ ఇండస్ట్రీస్​, అనంత్​ టెక్నాలజీ ఉన్నాయి. కోర్ మెంబర్లుగా గోద్రేజ్​, హ్యూగ్స్​ ఇండియా, అజిస్టా-బీఎస్​టీ ఏరోస్పేస్​ ప్రైవేట్ లిమిటెడ్​, బీఈఎల్​, సెంటమ్​ ఎలక్ట్రానిక్స్ అండ్​ మక్సర్ ఇండియా ఉన్నాయి.

ఇదీ చదవండి:నిరాడంబరంగా పంజాబ్​ సీఎం కుమారుడి వివాహం- సిద్ధూ గైర్హాజరు

Last Updated : Oct 11, 2021, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details