జీ7 సమావేశాల్లో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సహా వివిధ అంశాలపై చర్చించినట్లు జైశంకర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ పరిస్థితిపై సమాలోచనలు చేసినట్లు వివరించారు. కరోనా కట్టడిలో భారత్‌కు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
"నా చిరకాల స్నేహితుడు ఆంటోనీ బ్లింకెన్‌ను కలిసినందుకు సంతోషం. ప్రపంచవ్యాప్తంగా కరోనా సవాళ్లపై సవివరంగా చర్చించాం. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాల పెంపుపై దృష్టిసారించాం. విపత్కర పరిస్థితుల్లో అమెరికా అందించిన సహకారానికి కృతజ్ఞతలు. ఇండో పసిఫిక్‌లో సమస్యలు, ఐరాస భద్రతా మండలి, మయన్మార్ అంశం, వాతావరణ సమస్యలు సైతం మా సమావేశంలో చర్చకు వచ్చాయి."
-ఎస్ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి