ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను పరిరక్షించేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికాల విదేశాంగ మంత్రులు అభిప్రాయపడ్డారు. అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆంటోనీ బ్లింకెన్‌ను విదేశాంగ మంత్రి జైశంకర్ శుక్రవారం ఫోన్ చేసి అభినందించారు. ఈ సందర్భంగా వారిద్దరూ ద్వైపాక్షిక అంశాలతో పాటు కొవిడ్ టీకాల సరఫరా గురించి చర్చించారు. ప్రపంచం ముందున్న పలు సవాళ్లను సమష్టిగా ఎదుర్కొందామని అనుకున్నారు.
పెంటగాన్ వ్యాఖ్యలు..