సబ్‌మెరైన్‌తో సముద్రంలో ద్వారక నగర వీక్షణ Dwarka Submarine Project :దేశంలోని సుప్రసిద్ధ దివ్యక్షేత్రాల్లో ద్వారక ఒకటి. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వేలాది భక్తులు ఏటా తరలివస్తుంటారు. ఐతే పురాతన ద్వారక నగరం అరేబియన్ సముద్రం మునగడం వల్ల భక్తులెవరూ అక్కడికి వెళ్లలేకపోతున్నారు. ఈ ప్రాచీన నగరాన్ని భక్తులు చూడటానికి గుజరాత్ ప్రభుత్వం జలాంతర్గామి సేవలు ప్రారంభించడానికి సిద్ధమైంది. ఇటీవల ముంబయికి చెందిన ప్రభుత్వరంగ నౌక సంస్థ మజాగావ్‌తో ఒప్పందం చేసుకుంది.
"మేము ద్వారకకు వచ్చాక ఇక్కడ సబ్‌మెరైన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇప్పుడు మేము, మా పిల్లలను సముద్రం మధ్యలోకి తీసుకెళ్లి ద్వారకా ధీశుడిని దర్శించుకుని పూజించవచ్చు. ద్వారక సందర్శిస్తే గొప్ప అనుభూతి కలుగుతుంది. జలాంతర్గామిని త్వరగా ప్రారంభించాలని కోరుకుంటున్నాను, తద్వారా మేము ఈ స్థలాన్ని రెండోసారి సందర్శించవచ్చు"
--అక్షిత బ్రహ్మభట్ట, యాత్రికురాలు
24 మంది యాత్రికులతో 300 అడుగుల లోతుకు
Dwarka SubmarineDarshan :ఈ జలాంతర్గామికి 24 మంది యాత్రికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుందని గుజరాత్ పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. పర్యటకులతో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు డైవర్లు, టెక్నీషియన్, గైడ్ కూడా ఉంటారని వెల్లడించారు. జలాంతర్గామి భక్తులను అరేబియా సముద్రంలో 300 అడుగుల దిగువకు తీసుకెళ్తుందని తెలిపారు. అక్కడ నుంచి యాత్రికులు పురాతన నగరం శిథిలాలే కాకుండా అరుదైన సముద్ర జీవులను కూడా చూడగలరని వివరించారు. ఈ జలాంతర్గామి సేవలతో గుజరాత్‌లో పర్యాటకం పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.
"శ్రీకృష్ణుడు రాజ్యమేలిన ప్రదేశాన్ని చూసే అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్ తరానికి ద్వారకా ధీశుడు ఎలా ఉండేవాడో, ఈ ద్వారక, పురాతన ద్వారకకు భిన్నంగా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ జలాంతర్గామిని ప్రారంభించాలని కోరుకుంటున్నాను. పురాతన ద్వారకా నగరం శ్రీకృష్ణుని పాలించే రాజ్యం అని చాలా మంది నమ్ముతారు. ప్రతిపాదిత జలాంతర్గామి సర్వీస్ వార్త యాత్రికులలో ఆనందాన్ని పంచింది."
--రాఖీ శర్మ, యాత్రికురాలు
పురాతన ద్వారకా నగరం శ్రీకృష్ణుడు పాలించిన రాజ్యంగా భావిస్తారు. గుజరాత్ ప్రభుత్వం జలాంతర్గామి సేవల ప్రతిపాదనతో యాత్రికుల్లో ఆనందాలను పంచుతోంది.