పెళ్లి చేయట్లేదని తల్లిదండ్రులపై అజీమ్ మన్సూరీ ఫిర్యాదు Dwarf person marriage: పొట్టిగా ఉండటం వల్ల తనకు పెళ్లికావడం లేదంటూ వార్తల్లో నిలిచిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అజీమ్ మన్సూరీ మరోసారి పోలీస్ స్టేషన్ తలుపుతట్టారు. పెళ్లికూతురు దొరికినా.. వివాహం చేయటం లేదంటూ తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు. మూడు అడుగుల పొడవున్న అజీమ్.. తన వివాహం విషయంలో సాయం చేయాలంటూ శామ్లీ స్టేషన్ ఇంఛార్జికి మొరపెట్టుకున్నారు. హాపుఢ్ జిల్లా కేంద్రానికి చెందిన యువతితో 2021లోనే వివాహం నిశ్చయమైనా.. తల్లిదండ్రులు జాప్యం చేస్తున్నారని తెలిపారు.
" కొద్ది రోజులు వేచి ఉండాలని నా తల్లిదండ్రులు నన్ను ఒప్పించారు. నా ఇద్దరు సోదరులతో కలిసి వివాహం ఘనంగా జరిపిస్తామని చెప్పారు. కానీ, అంతవరకు వేచి ఉండే ఓపిక నాకు లేదు."
- అజీమ్ మన్సూరీ, మరుగుజ్జు యువకుడు.
అజీమ్ మన్సూరీ ఇచ్చిన ఫిర్యాదును అందుకున్నారు కైరానా ఎస్హెచ్ఓ. వివాహం విషయమై ఫిర్యాదు చేశారని, ఈ విషయమై అతడి తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు.
ఇదీ కథ:ఉత్తర్‌ప్రదేశ్‌కు శామ్లీకి చెందిన 26 ఏళ్ల అజీమ్ మన్సూరీ.. 3 అడుగుల 2 అంగుళాల పొడవు ఉంటారు. ఎన్నో సంబంధాలు వచ్చినా ఎత్తు తక్కువ ఉన్నందువల్ల పెళ్లి కుదరలేదు. దాంతో 2021లో స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి.. వైరల్‌గా మారాడు. దీంతో గాజియాబాద్‌కు చెందిన రెహానా అనే మరుగుజ్జు యువతి అజీమ్‌ను పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చింది. రెండున్నర అడుగుల ఎత్తు ఉన్న రెహానా సైతం ఇదే సమస్యతో ఇబ్బందులు పడింది. ఏడాది క్రితం వివాహం చేసేందుకు నిర్ణయించినా.. ఇప్పటికీ పెళ్లి చేయకపోవటం వల్ల మరోసారి పోలీసులను ఆశ్రయించారు అజీమ్.
ఇదీ చూడండి:'సల్మాన్ సినిమాలో ఛాన్స్ వద్దు.. పెళ్లే ముద్దు'
ఎట్టకేలకు అతనికి పెళ్లికూతురు దొరికింది