తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూలిన రైల్వే అండర్​పాస్.. నలుగురు మృతి - కూలిపోయిన రైల్వే అండర్​పాస్

ఝార్ఖండ్​ ధన్​బాద్​లో నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్​పాస్​ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు పరిహారాన్ని రైల్వేశాఖ ప్రకటించింది.

bridge collapse in jharkhand
bridge collapse in jharkhand

By

Published : Jul 13, 2022, 12:58 PM IST

కూలిన రైల్వే అండర్​పాస్.. నలుగురు మృతి

ఝార్ఖండ్​ ధన్​బాద్​లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్​పాస్​ కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రధాన్​ఖంత రైల్వే స్టేషన్ సమీపంలోని ఛతకులి గ్రామంలో అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రైల్వేశాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గ్రామస్థుల కథనం ప్రకారం.. ఈ అండర్​పాస్​ నిర్మాణం రాత్రి సమయంలో జరుగుతోంది. ఈ క్రమంలోనే పట్టాలపై నుంచి ఓ గూడ్స్​ రైలు రావడం వల్ల భూమి కుంగిపోయింది. దీంతో నిర్మాణంలో ఉన్న అండర్​పాస్​ ఒక్కసారిగా కూలిపోయింది. నిర్మాణ సమయంలో పదిమంది కార్మికులు ఉండగా.. వీరిలో ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. మరో నలుగురు బయటపడ్డారు. మృతులను నిరంజన్​ మహతో, పప్పుకుమార్, విక్రమ్​ కుమార్​, సౌరభ్ కుమార్​గా గుర్తించారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు పరిహారాన్ని రైల్వేశాఖ ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు కమిటీని సైతం నియమించింది. ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్​ డీసీఎం అఖిలేశ్ పాండే తెలిపారు. ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున గ్రామస్థులు చేరుకున్నారు. నిర్మాణ సంస్థ కార్మికులకు హెల్మెట్లు, షూ ఇవ్వలేదని, సరైన రక్షణ చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details