Duplicate Eknath Shinde: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వేషధారణలో ప్రజలను మోసగిస్తున్నాడు పుణెకు చెందిన విజయ్ మానే అనే వ్యక్తి. శిందే గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా శిందే వేషదారణలో బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లిన అతడు.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. అలాగే నేరస్థుడు శరద్ మోహోల్తో సీఎం ఏక్‌నాథ్ శిందే ఫొటోలు దిగినట్లు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో నిందితుడు విజయ్ మానేపై బండ్‌గార్డెన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
నిందితుడు విజయ్.. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఓ ఫొటోలో సీఎం శిందే నిలబడి ఉండగా.. నేరస్థుడు శరద్ మోహల్ కుర్చీలో కూర్చునట్లు కనిపించాడు. నిందితుడు విజయ్ మానే నిత్యం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేలా దుస్తులు ధరించి పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ఓ నేరస్థుడితో సత్రంలో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సీఎం శిందే ప్రతిష్ఠను దెబ్బ తీసేలా నిందితుడు విజయ్ మానే ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నకిలీ లా లైసెన్స్‌తో.:లా డిగ్రీ, లైసెన్స్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న 72 ఏళ్ల మహిళను బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా వృద్ధురాలు గత ఏడేళ్లుగా బాంద్రా ఫ్యామిలో కోర్టులో ప్రాక్టీస్ చేస్తోందని తెలిపారు. నిందితురాలిని కాశీనాథ్ సోహోనిగా గుర్తించారు. ఆమెపై ఈ ఏడాది జూన్ 9న కేసు నమోదైంది.
నిందితురాలు 2015లో మూడుసార్లు, 2021లో రెండుసార్లు బాంద్రా ఫ్యామిలీ కోర్టులో న్యాయవాదిగా హాజరైంది. బాధితురాలి వేరొకరి పేరుతో ఉన్న లైసెన్స్‌ను ఉపయోగిస్తోంది. వివిధ కోర్టుల్లో న్యాయవాదిగా హాజరై ప్రజలతో పాటు న్యాయవ్యవస్థనూ మోసం చేసింది. పోలీసుల విచారణకు అంగీకరించట్లేదు.