తమిళనాడు.. తిరుపత్తూర్‌లో దారుణం జరిగింది. ఫ్లేమ్ లిల్లీ దుంపలు తింటే దేహదారుఢ్యం పెరుగుతుందని వాట్సాప్‌లో మెసేజ్‌ను చూశారు ఇద్దరు వ్యక్తులు. ఆ మెసేజ్‌ను చూసి ఇద్దరూ లిల్లీ దుంపలను తిన్నారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురై ఒకరు మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తిరుపత్తూరులోని మిన్నూరుకు చెందిన లోగనాథన్ (25), సమీప గ్రామానికి చెందిన రత్నం(45) అనే వ్యక్తి ఓ ప్రైవేట్ క్వారీలో కలిసి పనిచేస్తున్నారు. పోలీసు శాఖలో చేరాలనే ఆసక్తి లోగనాథన్‌కు ఉంది. అతడు పోలీసు శాఖ నిర్వహించే దేహదారుడ్య పరీక్షల్లో ఉత్తీర్ణుతుడయ్యేందుకు వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్ చూసి లిల్లీ దుంపలను తిన్నాడు. అతడితో పాటు పనిచేసే రత్నం కూడా తిన్నాడు. కాసేపటికే వీరిద్దరూ అస్వస్థతకు గురయ్యారు.
ఇద్దరినీ చికిత్స నిమిత్తం వేలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అప్పటికే లోగనాథన్‌ను పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆస్పత్రికి తరలించమని వైద్యులు సూచించారు. అక్కడ చికిత్స పొందుతూ లోగనాథన్ మృతిచెందాడు. ఈ ఘటనపై అంబూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.