తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మొబైల్ వ్యసనం'తో మానసిక రోగిగా యువకుడు - మొబైల్​ వ్యసనం

Churu Youth Mobile addiction: మొబైల్ వ్యసనం ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఫోన్​ వాడకానికి బానిసైన ఓ యువకుడు.. చివరికి మానసిక రోగిగా మారిపోయాడు. ఈ విషాదకరమైన ఘటన రాజస్థాన్​లో జరిగింది.

mobile addiction
మొబైల్ వ్యసనం

By

Published : Nov 28, 2021, 11:07 AM IST

Updated : Nov 28, 2021, 1:13 PM IST

మొబైల్ వ్యసనం

Churu Youth Mobile addiction: ప్రస్తుతం యువత మొబైల్​ ఫోన్లకు బానిసలవుతున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. క్షణం తీరిక దొరికినా సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఇలానే.. మొబైల్ వినియోగానికి అతిగా అలవాటుపడిన ఓ యువకుడు.. చివరికి మానసిక రోగిలా మారిపోయాడు. ఈ సంఘటన రాజస్థాన్​లో జరిగింది.

మొబైల్ వినియోగిస్తున్న అక్రమ్
ఫోన్​ కావాలంటున్న అక్రమ్​

ఏమైందంటే..?

రాజస్థాన్​, చూరు ప్రాంతానికి చెందిన అక్రమ్​(20)కు ఫోన్​ అలవాటు అధికంగా ఉండేది. మొబైల్ వినియోగిస్తూ.. రాత్రుళ్లు నిద్రపోవటం కూడా మానేశాడు.

" ఎప్పుడూ మొబైల్​ వాడుతూనే ఉంటాడు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 వరకు అలా ఫోన్​ చూస్తూనే ఉంటాడు. నా భార్యతో చాట్ చేస్తున్నా అంటాడు. ఏమీ తినడు, తాగడు కేవలం అలా ఫోన్​ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మమ్మల్ని కూడా గుర్తుపట్టడం లేదు. ఆహారం ఇచ్చినా తీసుకోవడం లేదు. పరిస్థితిని గమనించిన డాక్టర్లు.. బాధితుడిని ఎమర్జెన్సీ వార్డ్​లో చేర్చాలని సూచించారు. చికిత్స అందిస్తుంటే కూడా ఫోన్ కావాలని అడుగుతున్నాడు."

- ఆర్​బాజ్​, బంధువు

కొద్దిరోజుల తర్వాత అక్రమ్​.. వింతగా ప్రవర్తించడాన్ని అతడి తల్లిదండ్రులు గుర్తించారు. అక్రమ్​ను చూరులోని సైకియాట్రిస్ట్​ వద్దకు తీసుకెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు.. నిద్రలేకపోవడం కారణంగా.. అక్రమ్​ మానసిక రోగిగా మారాడని, అతని ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

బంధువులను గుర్తుపట్టలేని స్థితిలో అక్రమ్

" ఎక్కువగా ఫోన్​ చూస్తుండటం వల్ల నిద్ర సమస్యలు ఎదురవుతాయి. దీంతో కుంగుబాటుకు గురయ్యే అవకాశం ఉంది. క్రమంగా ప్రవర్తనలో మార్పు వస్తుంది."

- జితేంద్ర కుమార్, మానసిక వైద్యుడు

అక్రమ్​కు 8నెలల క్రితం ఎంగేజ్​మెంట్ అయిందని అతడి తల్లిదండ్రులు తెలిపారు. ఎప్పుడు చూసినా ఫోన్​తోనే సమయం గడిపేవాడన్నారు. ఐదురోజులుగా అతడి ప్రవర్తనలో మార్పులు గమనించామన్నారు. అక్రమ్​ వింత చేష్టలకు ఒక్కోసారి భయబ్రాంతులకు గురయ్యామని తల్లిదండ్రులు వాపోయారు.

ఇదీ చూడండి:ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్​ పిల్లర్​​​.. ఎక్కడంటే?

Last Updated : Nov 28, 2021, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details