భారీ వర్షాలకు కూలిన ఇల్లు.. ఏడుగురు దుర్మరణం - బెళగావిలో వరదల కారణంగా చనిపోయిన ఏడుగురు
21:24 October 06
భారీ వర్షాలకు కూలిన ఇల్లు.. ఏడుగురు దుర్మరణం
కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. ఓ కుటుంబం బలైంది. బెళగావి జిల్లా బదాలా అంకళగి గ్రామంలో ఇల్లు కూలి.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం బుధవారం సాయంత్రం జరిగినట్లు అధికారులు తెలిపారు. వీరంతా ఇంట్లో ఉండగా అకస్మాత్తుగా ఇల్లు కూలింది. దీంతో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో ముగ్గురిని బయటకు తీసి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు చికిత్సపొందుతూ.. మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. హిరెబాగేవాడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతుల వివరాలు ఇలా ఉన్నాయి.
- గంగవ్వ భీమప్ప
- సత్యవ్వ అర్జున్
- పూజా అర్జున్
- సవితా భీమప్ప
- కాశవ్వ విట్టల్
- లక్ష్మీ అర్జున్
- అర్జున్ హనుమంత్
బెళగావి జిల్లా మృతులకు పరిహారం ప్రకటించింది రాష్ట్రప్రభుత్వం. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై పరిహారం ప్రకటించారు.