Drunken man rapes his brother's wife: తప్పతాగాడు. మద్యం మత్తులో సొంత తమ్ముడి భార్యపైనే కన్నేశాడు. ఇంట్లో ఎవరూలేరని నిర్ధరించుకుని గోడ దూకాడు. బలవంతంగా తమ్ముడి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్ చురు ప్రాంతంలోని దుద్వాకరా మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. విషయం బయట చెబితే తన రెండు నెలల పసిపాపను చంపేస్తానని నిందితుడు బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.