తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మందుకొట్టి అమ్మాయిల రచ్చ.. రేంజ్​ రోవర్​తో ఢీ.. ఒకరు మృతి.. ఎస్సైపైనా దాడి! - దిల్లీ యాక్సిడెంట్​

Drunken Girls Hit Car: మద్యం మత్తులో ఇద్దరు యువతులు రచ్చ చేశారు. తాగి రేంజ్​ రోవర్​ కారు నడుపుతూ.. ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా.. అతని భార్య, పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సైపైనా దాడికి యత్నించారు నిందితులు. ఈ ఘటన హరియాణా అంబాలాలో జరిగింది.

DRUNKEN GIRLS HIT CAR AT DELHI
DRUNKEN GIRLS HIT CAR AT DELHI

By

Published : May 22, 2022, 10:13 AM IST

Updated : May 22, 2022, 6:30 PM IST

మందుకొట్టి అమ్మాయిల రచ్చ

Drunken Girls Hit Car: ఇద్దరు యువతులు తాగి నానా హంగామా సృష్టించారు. రేంజ్​ రోవర్​ నడుపుతూ.. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును అతివేగంతో వచ్చి ఢీకొట్టారు. హరియాణా అంబాలాలోని దిల్లీ- అమృత్​సర్​ జాతీయ రహదారిపై శనివారం జరిగిందీ ఘటన. ఈ ఘటనలో 39 ఏళ్ల మోహిత్​ శర్మ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. అతని భార్య దీప్తి, 8 ఏళ్ల కుమార్తె ఆరోహి తీవ్రంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తు కారులో ఉన్న 9 నెలల చిన్నారి ప్రాణాలతో బయటపడింది.

బాలికలు నడిపిన రేంజ్​ రోవర్​ కారు

దిల్లీకి చెందిన మోహిత్​ శర్మ.. భార్యాపిల్లలతో కలిసి శనివారం హిమాచల్​ ప్రదేశ్​లోని పాలంపుర్​ వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. హైవేపై మోహ్డా ధాన్యం మార్కెట్​ సమీపంలో కారును రోడ్డు పక్కన ఆపి.. చెరుకు రసం తాగుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన రోంజ్​ రేవర్​ ఢీకొట్టింది.

నుజ్జునుజ్జయిన మరో కారు

ప్రమాద దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయి. వారు ఢీకొన్న కారు.. ఎగిరిపడింది. రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే.. స్థానికులు వారిని చుట్టుముట్టి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వారిని సివిల్​ ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ఉన్న యువతులు తమను దారిలో కొట్టారని మహిళా పోలీసులు ఆరోపించారు. ఆస్పత్రిలో కూడా హైడ్రామా చేశారని.. తల్లిదండ్రులు, లాయర్ వచ్చేవరకు ఏం మాట్లాడమని, సహకరించబోమని మొండికేసినట్లు వివరించారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డి మృతుడి భార్య దీప్తి

ఆ అమ్మాయిలు ఇద్దరూ మద్యం సేవించినట్లు అంబాలా డీఎస్పీ రామ్​ కుమార్​ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సైపైనా చేయిచేసుకున్నారని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:పెళ్లిలో డాన్స్.. మధ్యలోనే గుండెపోటు.. కుప్పకూలిన వృద్ధుడు

'దేశంపై భాజపా కిరోసిన్ చల్లింది.. ఒక్క నిప్పురవ్వ చాలు..'

Last Updated : May 22, 2022, 6:30 PM IST

ABOUT THE AUTHOR

...view details