తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Drunken Father Killed 3 Daughters : ట్రంకు పెట్టెలో ముగ్గురు బాలికల మృతదేహాలు.. విషం పెట్టి చంపిన తండ్రి.. మద్యానికి బానిసై.. - ముగ్గురు కుమార్తెలను చంపిన తండ్రి

Drunken Father Killed 3 Daughters : ముగ్గురు కుమార్తెలను హత్య చేసి ట్రంకు పెట్టెలో పెట్టాడు ఓ తండ్రి. మద్యానికి బానిసైన అతడు.. ఆర్థిక సమస్యలతో ముగ్గురికి విషం పెట్టి చంపాడు. ఈ దారుణ ఘటన పంజాబ్​​లోని జలంధర్​లో జరిగింది.

Drunken father killed 3 daughters
Drunken father killed 3 daughters

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 7:06 PM IST

Updated : Oct 2, 2023, 7:53 PM IST

Drunken Father Killed 3 Daughters :మద్యానికి బానిసైన ఓ తండ్రి.. ముగ్గురు కుమార్తెలను హత్య చేశాడు. వారి మృతదేహాలను ఓ ట్రంకు పెట్టెలో దాచి, ఇంటి బయట పెట్టాడు. ఈ దారుణ ఘటన పంజాబ్​​లోని జలంధర్​లో జరిగింది. ఆర్థిక సమస్యలతో తాళలేక ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఒప్పుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ జరిగింది
జలంధర్​లోని కాన్పూర్​ గ్రామానికి చెందిన సునీల్​ మండల్​కు కొన్నేళ్ల క్రితం మంజు మండల్​తో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు సంతానం. అయితే, మద్యానికి బానిసైన సునీల్​.. తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నాడు. ఆదివారం మద్యం సేవించిన సునీల్​.. తన ముగ్గురు కుమార్తెలు అమృత కుమారి(9), కంచన్​ కుమారి(7), వాసు(3)కు విషం పెట్టి చంపాడు. అనంతరం వారిని మూసి ఉంచిన ఓ ట్రంకు పెట్టెలో పెట్టాడు. అనంతరం ఏమీ తెలియనట్టుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా.. అసలు నిజాన్ని చెప్పాడు.

"అదివారం రాత్రి 8 గంటల నుంచి ముగ్గురు బాలికలు కనిపించడం లేదని వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఉదయం తాము పనులకు వెళ్లి.. రాత్రి వచ్చి చూసేసరికి పిల్లలు లేరని వారు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకుని.. పిల్లల కోసం వెతికాం. ఉదయాన్నే వారి ఇంటి ఎదుట ట్రంకు పెట్టెలో ముగ్గురు పిల్లల మృతదేహాలు ఉన్నాయని సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి వెళ్లి సునీల్​ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడు నేరాన్ని అంగీకరించాడు."

--హర్​బన్స్ సింగ్​, ఏఎస్​ఐ

తల్లిని హత్య చేసి.. ఇంట్లోనే కాల్చిన తనయుడు
95 ఏళ్ల తల్లిని దారుణంగా హత్య చేశాడు ఓ కొడుకు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే దహనం చేశాడు. ఈ దారుణ ఘటన ఒడిశా కందమాల్​లోని బడిముందాలో శనివారం రాత్రి జరిగింది. నిందితుడు సమీర్ నాయక్​కు తల్లి మంజులతో గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సమీర్​.. తల్లి గొంతు నులిమి హత్య చేశాడు. సాక్ష్యాలు లేకుండా చేసేందుకు.. ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేశాడు. ఇంట్లో నుంచి మంటలు వస్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే, నిందితుడు సమీర్​ ఓ కేసులో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించి వారం క్రితమే విడుదలయ్యాడు.

గొడ్డలితో కొడుకును నరికి చంపిన తండ్రి
బంగాల్​లోని సిలిగుఢీలో మద్యానికి 30 ఏళ్ల కొడుకును గొడ్డలితో నరికి చంపాడు తండ్రి. ఉద్యోగం చేయకుండా.. మద్యం తాగివచ్చి ప్రతిరోజూ ఇంట్లో గొడవ చేస్తున్నాడని ఆగ్రహించిన తండ్రి ఆదివారం రాత్రి హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టమ్​ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

Six People Killed In Old Factions : ఇద్దరి మధ్య వివాదం.. ఒకే కుటుంబంలోని ఐదుగురు బలి.. ఏం జరిగింది?

Tamilnadu Bus Accident : అదుపుతప్పి లోయలో పడ్డ టూరిస్ట్ బస్సు.. 9 మంది మృతి.. ఊటీ యాత్రలో విషాదం

Last Updated : Oct 2, 2023, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details