ఉత్తర్‌ప్రదేశ్‌లో మందుబాబులు రెచ్చిపోయి రెండు కుక్కపిల్లలను గాయపరిచారు. కుక్క చెవులను కత్తిరించి మందుతో కలిపి సేవించారు. మానవత్వాన్ని మంట గలిపే విధంగా ఉన్న ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ బరేలి జిల్లాలోని ఫరీదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాలివి..
ఫరీదాపుర్కు చెందిన ముఖేశ్ వాల్మీకి తన స్నేహితుడితో కలిసి మందు తాగాడు. మద్యం మత్తులో అటుగా వెళుతున్న రెండు కుక్కపిల్లలను పట్టుకుని ఇద్దరూ హింసించారు. దీంట్లో ఓ కుక్క పిల్ల చెవులను కోయగా.. మరో కుక్క పిల్ల తోకను గాయపరిచారు. అక్కడితో ఆగకుండా కోసిన కుక్క చెవులను వెంటతెచ్చుకున్న మందుతో కలిసి సేవించారు.
మత్తులో దారుణం.. శునకం చెవులు, తోకను కత్తిరించి మందులోకి స్టఫ్‌గా.. - uttarpraesh latest updates
మూగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తించారు ఇద్దరు మందుబాబులు. తమ క్రూరత్వాన్ని శునకం పిల్లలపై చూపించారు. వాటి చెవులు, తోక కత్తిరించి పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలి జిల్లాలో జరిగింది.
puppy
అక్కడే ఉన్న స్థానికులు.. జంతువుల కోసం పనిచేసే పీఎఫ్ఏ అనే స్వచ్ఛంద సంస్థకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న సంస్థ రెస్క్యూ ఇన్‌ఛార్జి ధీరజ్ పాఠక్.. ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన శునకం పిల్లలను జంతు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం శునకం పిల్లలు చికిత్స పొందుతున్నాయి. నిందితులపై ఫరీదాపుర్ పోలీసు స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ధీరజ్. జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.