తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మద్యం మత్తులో దారుణం.. శ్మశానంలో కాలుతున్న మృతదేహంలోని మాంసాన్ని తిని.. - mayurbhanj news

శ్మశానంలో కాలుతున్న ఓ యువతి మృతదేహంలోని మాంసాన్ని తిన్నారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. నిందితులిద్దర్ని గ్రామస్థులు.. చితకబాది పోలీసులకు అప్పగించారు.

Drunk men eat human flesh at cremation ground in Mayurbhanj
ఒడిశాలో మృతదేహాన్ని తిన్న మందుబాబులు

By

Published : Jul 12, 2023, 10:52 PM IST

Updated : Jul 12, 2023, 11:03 PM IST

శ్మశానవాటికలో కాలుతున్న ఓ 25 ఏళ్ల యువతి మృతదేహాంలోని మాంసాన్ని తిన్నారు ఇద్దరు వ్యక్తులు. ఈ దారుణ ఘటన ఒడిశాలో మయూర్​భంజ్ జిల్లాలో జరిగింది. బాలిక మృతదేహాన్ని తిన్న ఇద్దరు వ్యక్తులను గ్రామస్థులు చితకబాది.. పోలీసులకు అప్పగించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే..
లడసాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని బన్సాహి గ్రామానికి చెందిన మధుస్మిత సింగ్ అనే యువతి అనారోగ్యం బారిన పడింది. మధుస్మిత కుటుంబ సభ్యులు.. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. మధుస్మిత మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు స్వగ్రామానికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. చితికి నిప్పు పెట్టిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అప్పుడే దంత్ని గ్రామానికి చెందిన సుందర్ మోహన్ సింగ్, నరేంద్ర సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు శ్మశానవాటిక వద్దకు వచ్చారు. వీరిద్దరు కాలిన యువతి మృతదేహంలోని మాంసం తింటున్నారని గ్రామస్థులకు, మృతురాలి కుటుంబీకులకు సమాచారం అందింది.

వెంటనే శ్మశానం దగ్గర వచ్చిన గ్రామస్థులు.. ఇద్దరు నిందితులను చితకబాది బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న లడసాహి పోలీసులు.. నిందితులిద్దర్ని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకడైన సుందర్ మోహన్.. చుట్టుపక్కల గ్రామాల్లో కూలీ పనులు చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. అలాగే నిందితులిద్దరూ మద్యం మత్తులో ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

వృద్ధురాలి హత్య.. తలలోని మాంసాన్ని తిన్న నిందితుడు
కొన్నాళ్ల క్రితం రాజస్థాన్​లోని పాలీ జిల్లాలో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. 60 ఏళ్ల వృద్ధురాలిపై రాళ్లతో దాడి చేసి చంపేశాడు ఓ యువకుడు. ఆ తర్వాత ఆమె తలలోని మాంసాన్ని తింటూ కూర్చున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అతడిని అరెస్ట్​ చేశారు. మృతురాలిని శాంతి దేవిగా గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని శారధన గ్రామానికి చెందిన శాంతి దేవి(60) అనే మహిళను 24 ఏళ్ల వ్యక్తి చంపేశాడు. అనంతరం ఆమె తలలోని మాంసాన్ని తిన్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న గొర్రెల కాపరులు అది చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అతడు పరారయ్యాడు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : Jul 12, 2023, 11:03 PM IST

ABOUT THE AUTHOR

...view details