తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దుస్తులలో రూ100 కోట్ల డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు

Drugs smuggling in Chennai చెన్నై విమానాశ్రయంలో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి సుమారు రూ100 కోట్ల విలువైన హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు.

Drugs smuggling in chennai
Drugs smuggling in chennai

By

Published : Aug 13, 2022, 11:57 AM IST

Updated : Aug 13, 2022, 12:44 PM IST

చెన్నై ఎయిర్​పోర్ట్​లో రూ100కోట్ల డ్రగ్స్ షూలు దుస్తుల్లో తరలింపు

Drugs smuggling in Chennai తమిళనాడు చెన్నై విమానాశ్రయంలో అక్రమంగా డ్రగ్స్​ సరఫరా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇథియోపియో నుంచి చెన్నైకు డ్రగ్స్​ను అక్రమంగా తరలిస్తున్నారని కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆఫ్రికాకు చెందిన ప్రయాణికులను ప్రత్యేకంగా తనిఖీలు చేయగా.. వారి వద్ద డ్రగ్స్​ లభించలేదు.

ఈ సమయంలోనే భారత్​కు చెందిన ప్రయాణికుడు ఇక్బాల్​ పాషా అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతడిని ప్రశ్నించగా.. సరైన సమాధానాలు చెప్పలేదు. అనుమానం వచ్చిన అధికారులు.. ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. అతడి దుస్తులు, షూలు, బ్యాగులలో సుమారు 10 కిలోల హెరాయిన్​, కొకైన్​ లభ్యం కాగా వీటిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్​లో సుమారు రూ.100 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు.

దీనిపై విచారణ చేపట్టిన కస్టమ్స్ అధికారులు.. నిందితుడిని అరెస్ట్​ చేశారు. మాదకద్రవ్యాలు ఎక్కడ నుంచి తీసుకువచ్చాడు? ఎక్కడికి తరలిస్తున్నాడు? అనే కోణంలోను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 1932లో చెన్నై విమానాశ్రయం ప్రారంభమైన నాటి నుంచి.. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్​ దొరకడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:నీట్‌, జేఈఈ విలీనం.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే

తెలుగు సినిమా చూసి బలవన్మరణం.. 20 లీటర్ల పెట్రోల్ పోసుకొని..

Last Updated : Aug 13, 2022, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details