Drugs Seized In Rajasthan: రాజస్థాన్ బాడ్మేర్ ప్రాంతంలోని భారత్- పాకిస్థాన్ సరిహద్దులో 14 కేజీల 740 గ్రాముల హెరాయిన్‌ను ఎస్ఓజీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ. 35 కోట్లకుపైనే ఉంటుందని అంచనావేశారు. ఈ హెరాయిన్ బాడ్మేర్ సరిహద్దులోని పొదల్లో దొరికినట్లు చెప్పారు. పాకిస్థాన్ గుండా భారత్‌లోకి ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై గద్రా రోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.