Drugs Seized In Mumbai : ముంబయిలోని నావశేవా పోర్టులో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. పోర్టులోని ఓ కంటైనర్ నుంచి సుమారు 22 టన్నుల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ. 1,725 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
లికోరస్ అనే మొక్కలకు హెరాయిన్ కోటింగ్ వేసి డ్రగ్స్ తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మాదకద్రవ్యాల ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు భిన్నమార్గాలను పాటించి డ్రగ్స్ తరలిస్తున్నారనేందుకు ఈ ఘటన ఉదాహరణ అని చెప్పారు.
22 టన్నుల హెరాయిన్ స్వాధీనం.. విలువ వెయ్యి కోట్లపైనే.. - ముంబయిలో డ్రగ్స్ స్వాధీనం
drugs seized in mumbai
12:09 September 21
22 టన్నుల హెరాయిన్ స్వాధీనం.. విలువ వెయ్యి కోట్లపైనే..
Last Updated : Sep 21, 2022, 2:10 PM IST