Drugs Seized in Gujarat Port: గుజరాత్లో మరోమారు భారీ స్థాయిలో డ్రగ్స్ బయటపడ్డాయి. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇటెలిజెన్స్(డీఆర్ఐ) సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో.. పిపావావ్ నౌకాశ్రయంలో 90 కిలోల హెరాయిన్ పట్టుబడింది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.450 కోట్లకుపైనే ఉంటుందని రాష్ట్ర డీజీపీ ఆశిశ్ భాటియా తెలిపారు. ఇరాన్‌లోని అమ్రేలి జిల్లా నుంచి పిపావావ్ పోర్టుకు వచ్చిన కంటెయినర్లో మాదకద్రవ్యాలు దొరికినట్లు చెప్పారు. అధికారుల కళ్లుగప్పి మత్తుపదార్థాలను చేరవేసేందుకు డ్రగ్ సిండికేట్.. హెరాయిన్‌తో కూడిన ద్రావణంలో ధారాలను నానబెట్టే ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించినట్లు తెలిపారు డీజీపీ. ఆ తర్వాత వాటిని కాల్చి, వచ్చిన పొడిని ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు.
" ఐదు నెలల క్రితం పిపావావ్ పోర్టుకు ఇరాన్ నుంచి వచ్చిన కంటెయినర్లో ధారాలతో కూడిన పెద్ద పెద్ద బ్యాగులు ఉన్నాయి. నాలుగు అనుమానిత బ్యాగులను పరిశీలించగా.. హెరాయిన్‌తో కలిసిన ధారాలు సుమారు రూ.395 కిలోలు ఉన్నట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. వాటి నుంచి హెరాయిన్‌ను వేరు చేయగా 90 కిలోలు వచ్చింది. దాని విలువ రూ.450 కోట్లకుపైనే ఉంటుంది."
- ఆశిష్ భాటియా, గుజరాత్ డీజీపీ